పుష్పలో సునీల్ కు భార్యగా రంగమ్మత్త..!

Jabardasth Anchor Anasuya Bharadwaj To Play Sunil Wife In Pushpa Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Sunil,Sunil,Hero Sunil,Anasuya Bharadwaj New Movie,Anasuya Bharadwaj Latest Movie,Anasuya Bharadwaj Movies,Sunil Latest Movie,Sunil Latest Film Updates,Sunil Latest News,Anasuya Bharadwaj,Anasuya Bharadwaj Latest News,Pushpa,Pushpa Movie,Pushpa Film,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Update,Pushpa Movie Latest News,Pushpa Movie Latest Updates,Anchor Anasuya Bharadwaj,Anasuya Bharadwaj To Play Sunil Wife In Pushpa,Anasuya Bharadwaj In Pushpa,Anasuya Bharadwaj To Play Sunil Wife,Anasuya To Play Sunil Wife Role In Pushpa,Anchor Anasuya Bharadwaj To Act As Sunil Wife In Pushpa,Allu Arjun,Allu Arjun Pushpa,Anasuya Bharadwaj To Play Sunil Wife In Allu Arjun Pushpa

‘రంగస్థలం’లో రంగమ్మత్త క్షణం’లో ఏసీపీ జయ భరద్వాజ్‌ గా సెలెక్టెడ్ గా పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది అనసూయ. ఒకవైపు బుల్లితెరపై టాప్ యాంకర్ గా యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం పలు సినిమాలు అనసూయ చేతిలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలో కూడా మొత్తానికి రంగమ్మత్త ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా చెప్పడంతో క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. ఈసినిమాలో సునీల్ కు జోడీగా అనసూయ నటిస్తున్నట్టు తెలుస్తుంది. సునీల్ కు భార్యగా అనసూయ నటిస్తున్న వార్తలు వస్తున్నాయి. తన పాత్ర బాగా నచ్చడంతో ఈ పాత్రకు ఒప్పుకుందట.

మరి సుకమార్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ ను అనసూయ కోసం డిజైన్ చేశాడు.. అనసూయ కూడా ఆరోల్ కు అలాగే న్యాయం చేసింది కాబట్టే ఇప్పటికీ కూడా రంగమ్మత్త అనే పిలుస్తుంటారు. మరి సుకుమార్ సినిమా అంటే ఖచ్చితంగా ప్రతి పాత్రకుఅంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈసినిమాలో అనసూయకు ఎలాంటి పాత్రను డిజైన్ చేశాడో చూద్దాం..

కాగా అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వస్తున్న‘పుష్ప‌’ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా.. అది యూట్యూబ్ లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలుసుకదా. కేవలం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఈసినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్పరాజ్ పాత్రలో లారీ డ్రైవర్ గా బన్నీ తన విశ్వరూపం చూపించనున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా విలన్‌ పాత్రలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. ఆగష్ట్ లో ఈసినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యం అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.