చాలా గ్యాప్ తరువాత రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మాస్ మహారాజా రవి తేజ. క్రాక్ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవటమే కాకుండా అత్యధికంగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోవైపు అర్జున్, అనసూయ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితో పాటు మరో కొత్త సినిమాను కూడా స్టార్ట్ చేశాడు రవితేజ. ఉగాది సందర్భంగా ఈ సినిమాను రవితేజ ప్రారంభించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా..యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈసినిమాను నూతన దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించనున్నాడు. కాగా ఇప్పుడు ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ 30 రోజుల్లో పూర్తి చేయాలని రవితేజ కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆ 30 రోజులకు గాను రవితేజ దాదాపు 8 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందుకుంటున్నాడని సమాచారం.
కాగా ఇందులో రవితేజ సరసన మజిలీఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనునన్నారు చిత్రయూనిట్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: