స్పీడుమీదున్న వెంకీ – దృశ్యం2 ప్యాకప్

Venkatesh Wraps Up His Shooting Schedule For Drushyam 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Venkatesh,Actor Venkatesh,Drushyam 2,Drushyam 2 Movie,Drushyam 2 Telugu Movie,Drushyam 2 Movie Telugu,Drushyam 2 Update,Drushyam 2 Movie Update,Drushyam 2 Film Update,Drushyam 2 Movie Latest Updates,Drushyam 2 Movie News,Drushyam 2 Movie Latest News,Venkatesh Wraps Up Shooting For Drushyam 2,Venkatesh Drushyam 2,Venkatesh Wraps Up Drushyam 2 Movie Shoot,Venkatesh Wraps Up Drushyam 2 Movie Shooting,Meena Sagar,Jeethu Joseph,Venkatesh Wraps Up His Portion For Drishyam 2,Venkatesh Wraps Up Drishyam 2,Venkatesh Daggubati Wraps Shoot For Drishyam 2,#Drishyam2

వెంకీ స్పీడు మాములుగా లేదు. దృశ్యం 2 సినిమా అలా మొదలు పెట్టాడో లేదో అప్పుడే షూటింగ్ ను పూర్తి చేసేశాడు. జీతూ జోసఫ్ దర్శకత్వంలో వెంకీ ప్రధాన పాత్రలో దృశ్యం రీమేక్ దృశ్యం 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. గత కొద్దిరోజులుగా ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ ఏడాదే ఈసినిమాను రిలీజ్ చేయాలన్న నేపథ్యంలో అస్సలు గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ ను చేశారు. 50 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని రంగంలోకి దిగింది చిత్రబృందం.. అనుకున్నట్లుగానే ఈసినిమా షూటింగ్ పూర్తిచేసేలా కనిపిస్తుంది. ఇప్పటికే వెంకీ తన పార్ట్ పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని జీతూ జోసఫ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. దృశ్యం 2 .. వెంకటేష్ దాకు లాస్ట్ వర్కింగ్ డే .. మీ సపోర్ట్ మాకు అందించినందుకు థ్యాంక్స్ అని పోస్ట్ లో పేర్కొన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా తొలి భాగం రీమేక్‌లో నటించిన వెంకటేష్, మీనా ఇప్పుడు సీక్వెల్‌ రీమేక్‌లోనూ నటిస్తున్నారు.
కృతిక, ఎస్తేర్, నదియా, వారితో పాటు సంపత్ రాజ్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి. సురేష్‌బాబు ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.

ఇంక ఈసినిమాతో పాటు నారప్ప, ఎఫ్ 3 సీక్వెల్ కూడా చేస్తున్నాడు వెంకీ. నారప్ప ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఎఫ్ 3 సినిమా ఉగాది రోజు నుండే కొత్త షెడ్యూల్ ను ప్రారంభించింది. మొత్తానికి ఈఏడాది వెంకీ 3 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేలా ఉన్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.