సలార్, కె.జి.యఫ్2 ఒకే చోట

Salaar and KGF2 Movie Music Recordings To Be Done At Same Place Says Director Prashanth Neel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Update,Salaar Movie Update,KGF 2,KGF2,KGF 2 Chapter 2,KGF 2 Chapter 2 Movie,KGF 2 Chapter 2 Telugu Movie,KGF 2 Chapter 2 Update,KGF 2 Chapter 2 Movie Update,Salaar and KGF2 Movie Music Recordings,Director Prashanth Neel,Prashanth Neel,Director Prashanth Neel About Salaar And KGF2 Movie,Salaar And KGF2 Music Recordings To Be Done At Same Place,The Only Place Where Salaar And KGF Cross Paths,Yash’s KGF Chapter 2,Prabhas’ Salaar,Salaar and KGF2 Movie Music,Salaar Music Recordings,KGF2 Movie Music Recordings,Prashanth Neel New Movie,Prashanth Neel Movies,Prashanth Neel Latest News

మోస్ట్ అవైటింగ్ ఇండియన్ సినిమాల్లో కె.జి.యఫ్2 అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా వస్తున్న ఈసినిమాపై మామూలు అంచనాలు లేవు. పార్ట్ 1 సంచలన విజయంతో దాని ఎఫెక్ట్ పార్ట్ 2 పై కూడా పడింది. దీంతో ప్రశాంత్ నీల్ కూడా చాలా జాగ్రత్తగా సినిమా అవుట్ ఫుట్ కోసం కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే ప్రశాంత్ నీల్ మరోవైపు సలార్ షూటింగ్ పనులు కూడా చూసుకుంటున్నాడు. ఇక ఇన్ని రోజులు ఈసినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదని నిరాశ పడుతున్న ఫ్యాన్స్ కు తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం కెజిఎఫ్-సలార్ పనులు ఒకే దగ్గరగా జరుగుతున్నట్టు తెలిపాడు. సంగీత దర్శకుడు బాసూర్‌ రవి అటు సలార్ మ్యూజిక్‌ పనులను ఇటు కెజిఎఫ్‌ 2 రీ రికార్డింగ్‌ వర్క్‌ ని షెడ్యూల్‌ ప్రకారం పూర్తి చేస్తున్నాడని చెప్పాడు. అంతేకాదు రవితో పాటు స్టూడియో దగ్గర దిగిన ఫోటోని షేర్‌ చేశాడు.

కాగా కె.జి.యఫ్2 సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

మరోవైపు పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినమా తెరకెక్కబోతుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను కూడా హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + one =