మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కోకాపేటలో వేసిన భారీ టెంపుల్ సెట్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో సోనూసూద్ మెయిన్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆచార్య’ సెట్స్‌కు సోనూసూద్ తను ఉంటున్న హోటల్ నుంచి సైకిల్‌పై చేరుకున్నారు. సోనూసూద్ సైకిల్‌పై వస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాను దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన అంశం నేపథ్యంలో ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇక ‘ఆచార్య’ సినిమా విషయానికి వస్తే దీన్ని మే 13న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు సినీపండితులు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: