ఉగాది సర్ ప్రైజ్ – కుటుంబ సమేతంగా ‘నారప్ప’

Venkatesh’s Narappa Movie New Poster Released On Ugadi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Narappa,Venkatesh Daggubati Shares First Look Poster With Priyamani,Happy Ugadi,Narappa Movie,Narappa Film,Narappa Telugu Movie,Narappa Update,Narappa Movie Update,Narappa Telugu Movie Latest Update,Narappa Movie News,Venkatesh Narappa,Venkatesh Daggubati,Priyamani,Family Poster From Venkatesh's Narappa,Narappa Movie New Poster Released,Narappa New Poster Released On Ugadi,Narappa New Poster,Narappa Latest Poster,Venkatesh Narappa New Poster,Narappa Ugadi Poster With His Family,Narappa Ugadi Poster,Narappa Ugadi Special Poster,Venkatesh's Narappa Movie,#Narappa

టాలీవుడ్ అగ్రహీరోల్లో చిరు తో పాటు వెంకీ కూడా చాలా స్పీడు మీదు ఉన్నాడు. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.ఇకవెంకీ చాలా కాలం తరవాత చేస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘నారప్ప’. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు ఇది రీమేక్ గతంలో వెంకటేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప’కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈసినిమా నుండి ఉగాదికి సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే కాదు. ఇక చెప్పినట్టే ఆ సర్ ప్రైజ్ ను రివీల్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుద‌లైన గ్లింప్స్, పోస్టర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ వెంకటేష్ పంచెకట్టుతో అచ్చమైన పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కుటుంబ సమేతంగా ఎదో శుభకార్యానికి వెళుతున్నట్టుగా పోస్టర్ ను డిజైన్ చేశారు.

కాగా ప్రియమణి ఈ సినిమాలో సుందరమ్మగా నటిస్తుంది. కేరాఫ్ కంచ‌ర‌పాలెం ఫేం కార్తీక్ ర‌త్నం కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా పాత్రలో కార్తీక్ ర‌త్నం నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మే 14 ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + nine =