ఫైనల్లీ చాలా రోజుల సస్పెన్స్ తరువాత బాలయ్య-బోయపాటి సినిమా టైటిల్ పై క్లారిటీ వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా ఇది. దీనితో ఈసినిమాపై అంచనాలు పెరగడమే కాదు.. ముందు రెండు సినిమాలు సింహా, లెజెండ్ లాంటి పవర్ ఫుల్ టైటిల్స్ పెట్టారు. ఇప్పుడు మూడో సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారబ్బా అని ఎదురుచూస్తున్నారు. ఇక చిత్రయూనిట్ కూడా ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ అయ్యేలా టైటిల్ పెట్టాలని ఇన్ని రోజులు టైమ్ తీసుకున్నారు. ఫైనల్లీ టైటిల్ ను రివీల్ చేశారు. అఖండ అనే టైటిల్ ను రిలీజ్ ను ఫిక్స్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ‘కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది అంటూ’ బాలయ్య చెప్పే డైలాగ్ అలరిస్తోంది. బాలయ్య స్వామిజీ లుక్ లో దర్శనమిచ్చి షాకిచ్చారు. మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూాడా చాలా బాగుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అఖండ!! #Akhanda
Here’s the massive title roar of Blockbuster combo #NandamuriBalakrishna #BoyapatiSrinu#AkhandaOnMay28th #BB3TitleRoar@ItsMePragya @actorsrikanth @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation @WhackedOutMedia
— Dwaraka Creations (@dwarakacreation) April 13, 2021
ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నాడట. వాటిలో రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. మే 28న ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.. మరి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అది కుదురుతుందో లేదో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: