క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రవితేజ. ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్స్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు మరోసారి మరో ఎనర్జిటిక్ పాత్రలో రవితేజ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈసినిమాను మే 28న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేయడంతో.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ టీజర్‌ను సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించినట్టు కనబడుతోంది. టీజర్ స్టార్టింగ్‌లో ఓ హార్బర్‌ను చూపిస్తూ.. జైల్లో హీరో రవితేజను చూపించారు. ఈ సినిమాలో రవితేజ సైకో తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
Unfolding our MassMaharaja @RaviTeja_offl in Action Packed #KhiladiTeaser🔥
▶️https://t.co/nU42K6f5u5@ThisIsDSP @DimpleHayathi @Meenachau6 @idhavish #KoneruSatyanarayana #AStudiosLLP @PenMovies @KHILADiOffl @adityamusic #Khiladi 🕶️ pic.twitter.com/nR8q03cjwt
— Ramesh Varma (@DirRameshVarma) April 12, 2021
కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతీలాల్ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ‘లూసిఫర్’ ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: