‘ఎన్టీఆర్ 30’ క్లారిటీ వచ్చేసింది – కొరటాలతో కన్ఫామ్

New Update On NTR 30 Released,Jr. NTR 30 Movie Update Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jr NTR,Jr NTR Latest News,Jr NTR New Movie News,Jr NTR Next Project News,Jr NTR Latest Film Details,Jr NTR Upcoming Project News,Jr NTR New Film Details,Jr NTR Latest Movie Details,Jr NTR Next Film with Koratala Siva,#NTR30

ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మాత్రం గత కొద్దిరోజులుగా చాలా కన్ఫ్యూజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కే రెండేళ్లకు పైగా టైమ్ పట్టింది. ఇక ఎలాగొలా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది కాబట్టి ఇప్పుడు ఫోకస్ మొత్తం ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఎప్పుడో ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఈ సినిమానే అన్నారు. కానీ ఇప్పుడు వేరే వార్తలు వినిపిస్తున్నాయి. ముందు మహేష్ త్రివిక్రమ్ సినిమా వస్తుందని తరువాతే ఎన్టీఆర్ సినిమా వస్తుందని అన్నారు. మరోవైపు ఎన్టీఆర్ తో కొరటాల సినిమా కూడా ఉంటుందని అన్నారు. ఫైనల్ గా ఇక ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ కు బ్రేక్ వేశారు. ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. నెక్స్ ప్రాజెక్ట్ కొరటాలతో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. జనతా గ్యారేజ్ సినిమాలో లోకల్ గా రిపేర్ చేశాం.. బట్ ఫర్ ఏ చేంజ్ .. ఈసారి బౌండరీస్ దాటుతున్నాం అని కొరటాల తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా చెప్పేశారు ఏప్రిల్ 29, 2022 న ఈసినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. యువసుధా ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మరి త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాలి. దీనితో పాటు ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా రానుంది. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =