‘అన్నాత్తే’ సెట్ లో స్టైలిష్ గా రజినీ..!

Super Star Rajinikanth Joins The Set Of Annaatthe Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Super Star Rajinikanth,Super Star Rajinikanth Latest News,Super Star Rajinikanth Upcoming Movie News,Super Star Rajinikanth Latest Movie Details,Super Star Rajinikanth Upcoming Project Details,Annaatthe,Annaatthe Movie,Annaatthe Telugu Movie,Rajinikanth Joins The Set Of Annaatthe,Rajinikanth Joins The Set Of Annaatthe Movie

శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. ఇటీవలే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా మధ్యలో మళ్లీ బ్రేక్ పడింది. చిత్ర సిబ్బందిలో కొంత మందికి కరోనా రావడం.. ఆతరువాత రజినీ కూడా అనారోగ్యానికి గురవ్వడంతో మళ్లీ షూటింగ్ కు అంతరాయం కలిగింది. మళ్లీ మూడు నెలల గ్యాప్ తరువాత రీసెంట్ గానే షూటింగ్ మొదలైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్నారు రజినీకాంత్. సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా ‘అన్నాత్తే’ షూటింగ్ స్పాట్ లో రజినీకాంత్, దర్శకుడు శివ కలిసి ఉన్న ఒక పిక్ ను షేర్ చేశారు నిర్మాతలు. ఈ పిక్ లో రజినీకాంత్ తెల్లని చొక్కా, పంచ ధరించి స్టైలిష్ గా కన్పిస్తున్నారు.

కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి కూడా విదితమే. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. నిజానికి ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేశారు. అది ఎప్పుడో అయిపోయింది. సినిమా షూటింగే పూర్తి కాలేదు. మరి ఈసినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =