#BB3 టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

Balakrishna Boyapati Srinu BB3 Movie Title Announcement On Ugadi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Boyapati Srinu and Nandamuri Balakrishna Movie BB3 Title Release Date Confirmed,BB3 Title Release Date Confirmed,BB3 Movie Updates,BB3 Movie Latest News,BB3,Balakrishna And Boyapati Srinu BB3 Movie Title Announcement On Ugadi

బాలకృష్ణ సినిమాలకు పెట్టే టైటిల్స్ ఎంత పవర్ ఫల్ గా ఉంటాయో. బాలయ్య సినిమాలకు టైటిల్స్ పెట్టాలంటే పెద్ద టాస్కే దర్శకనిర్మాతలకు. అందుకే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమాకు ఇప్పటి వరకూ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టారు.. చాలా వరకూ షూటింగ్ కూడా మొదలు పెట్టారు.. కానీ టైటిల్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. మొత్తానికి టైటిల్ ను ఫిక్స్ చేసినట్టున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా టైటిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఉగాది పండుగ సందర్భంగా మధ్యాహ్నం 12గంటల 33 నిమిషాలకు టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఇంతకుముందు వినిపించింది. కానీ ఇప్పుడు అఖండ అనే మరో టైటిల్ కూడా వినిపిస్తోంది. మరి ఈరెండు టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ ఉంటుందా.. లేక రెండు కాకుండా మరేదైనా టైటిల్ ఉంటుందా అన్నది తెలియాలంటే రేపటివరకూ ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నాడట. వాటిలో రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. మే 28న ఈసినిమాను ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నట్టు ప్రకటించారు.. మరి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అది కుదురుతుందో లేదో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 8 =