మోడల్ , థియేటర్ ఆర్టిస్ట్ నభా నటేష్ “నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి , తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టాలెంటెడ్ ఆర్టిస్ట్ నభా నటేష్ “డిస్కో రాజా “, సోలో బ్రతుకే సో బెటర్ “, “అల్లుడు అదుర్స్ “మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నితిన్ హీరోగా రూపొందుతున్న “మాస్ట్రో “మూవీ లో నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ జూన్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. నభా నటేష్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “మాస్ట్రో ” మూవీ తన కెరీర్ లో ఫస్ట్ రీమేక్ మూవీ అనీ , ఈ రీమేక్ మూవీ లో నటించడం ఛాలెంజింగ్ గా ఉందనీ , ఒక మంచి చిత్రం లో భాగం అయినందుకు ఆనందంగా ఉందనీ చెప్పారు. తన పాత్రకు తన స్వంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పాలనే కోరికను వెల్లడించారు. ఆ విషయాన్ని “మాస్ట్రో “మూవీ టీమ్ తో చర్చించాననీ , త్వరలోనే ఫైనల్ అవుతుందనీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: