పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘వకీల్ సాబ్’ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజ్ చేయగా ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా దీనికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా నుండి కంటి పాప అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు థమన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మార్చి 17 సాయంత్రం 5 గంటలకు ఈపాటను రిలీజ్ చేయనున్నారు.
Respect to Our #Leader #PowerStar
Shri @PawanKalyan gaaru ✊Our #KantipapaKantipapa Will Start Flying towards Ur Ears Will HuggG 🤗 U tight 🦋
#MARCH17TH 5pm🎵#VakeelSaabThirdSingle ❤️#VakeelSaabMusic ♥️#VakeelSaab @ramjowrites @ArmaanMalik22 https://t.co/hSR8FxdDPd
— thaman S (@MusicThaman) March 15, 2021
శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: