“యువకుడు ” (2000) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన భూమిక “ఖుషి “, “ఒక్కడు “, “సింహాద్రి “, “మిస్సమ్మ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషా చిత్రాలలో భూమిక నటిస్తున్నారు. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ “బంగార్రాజు “మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున , రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్ని నాయనా “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా “సోగ్గాడే చిన్ని నాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు “మూవీ తెరకెక్కనుంది. రమ్యకృష్ణ కథానాయిక కాగా భూమిక నెగటివ్ ఛాయలున్న ఒక కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: