అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే టైటిల్, పోస్టర్స్, టీజర్ లతో ఆకట్టుకున్న జాతిరత్నాలు.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక స్వప్న సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించారు. ఇక ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ్ అశ్విన్ తను చేయబోతున్న ప్రభాస్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎప్పుడూ కూడా సినిమా రేంజ్ ఏంటి.. బిజినెస్ ఏంటి.. కలెక్షన్లు ఏంటి అనే వాటి గురించి పట్టించుకోరు.. ఇక సోషల్ మీడియాపై అంతగా ఆసక్తి కూడా ఉండదు.. ఎప్పుడైనా కలిస్తే మా ప్రాజెక్ట్ గురించి, ఆయన చేసే ఇతర సినిమా కథల గురించి మాత్రమే చర్చిస్తుంటాడని చెప్పుకొచ్చాడు. మహానటి సినిమాకోసం అయితే కారులు లాంటివి అద్దెకు తెచ్చి వాడాము.. కానీ ఈసినిమాకు అలా కాదు ప్రతి ఒక్కటీ కొత్తగా క్రియేట్ చేయాలి.. ఒక డిఫరెంట్ వరల్డ్ ను సృష్టించాలి.. దానికి టైమ్ పడుతుంది.. ప్రస్తుతం అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.. జులై నుండి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాము అని తెలిపాడు.
అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా మెంటర్ గా పని చేయనున్నారు. మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: