సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో ఆది. కెరీర్ మొదట్లో బాగానే హిట్లు అందుకున్నాడు.. కానీ ఈమధ్య ఆదికి సరైన హిట్ పడలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఓ సాలిడ్ హిట్ కొట్టలేకపోతున్నాడు. చివరకు తండ్రి సాయి కుమార్‌తో కలిసి నటించినా కూడా హిట్ మాత్రం పడలేదు. ఇప్పుడు మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈనేపథ్యంలోనే శశి అనే డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ వల్ల ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగాయి. ఒకే ఒక లోకం నువ్వే పాట కూడా మంచిగా ఆకట్టుకుంది. ఇక మార్చి 19న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. దీనిలో భాగంగా నేడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Witness the Soulful♥️ trailer of #Sashi launched by 𝐏𝐎𝐖𝐄𝐑 𝐒𝐓𝐀𝐑 @PawanKalyan garu ▶️ https://t.co/ydnwCV2Zj2#SashiTrailer #SashiOnMarch19th#AadiSaiKumar @Surbhiactress @rashis276 @Arunchiluveru @SNaiduNadikatla @SHMovieMakers @rpvarmadatla @adityamusic @WhackedOutMedia pic.twitter.com/Oxx84kYEAJ
— AadiSaikumar (@AadiSaikumar) March 10, 2021
మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది’ అని ఆది చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.’మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మన బలహీనతలను గెలవాలి’… ‘మనల్ని చూసి ఎవడైనా భయపడాలి కానీ, ఎవడినో చూసి మనం భయపడడం ఏంటీ’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక యాక్షన్ సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మొత్తానికి పవర్ ఫుల్ డైలాగ్స్.. యాక్షన్ సీక్వెన్స్ లతో ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటుంది.
కాగా లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి, రాశీ సింగ్ హీరోయిన్లు గా నటిస్తుండగా రాజీవ్ కనకాల, జయప్రకాష్, అజయ్, వెన్నెల కిషోర్, రాశి సింగ్, తులసి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు.
మరి జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: