‘గని’ లో జాయిన్ అయిన ‘ఉపేంద్ర’

Kannada Star Actor Upendra Joins The Sets Of Ghani,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Upendra Rao,Actor Upendra Rao,Varun Tej,Hero Varun Tej,Varun Tej Starrer Ghani,Ghani,Ghani Movie,Ghani Film,Ghani Telugu Movie,Ghani Movie Telugu,Ghani Movie Updates,Ghani Update,Ghani Movie Shoot News,Upendra Rao Joins Ghani Shoot,Upendra Rao Joins Ghani Sets,Upendra Rao Joins The Sets Of Ghani Movie,Upendra Rao Joins Ghani Movie Shoot,Upendra Joins Ghani Shoot,Superstar Upendra Joins The Shoot Of Mega Prince Varun Tej's Ghani,Upendra Joins The Shoot Of Ghani,Upendra Latest News,Ghani Shoot,Upendra Rao Joins The Sets Of Ghani

కొర్ర‌పాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా గని సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.ఇటీవలే వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను టైటిల్ ను రిలీజ్ చేశారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొనేందుకు గాను ఉపేంద్ర హైదరాబాద్ చేరుకున్నారు. ఈ షెడ్యూల్‌లో వరుణ్ తేజ్, ఉపేంద్రలపై పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. వీరిద్దరి మధ్య ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్రల లాంటి స్టార్లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించారు చిత్ర యూనిట్. జులై 30 విడుదల తేదీ ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు అదే డేట్ ను రాధే శ్యామ్ కూడా లాక్ చేసుకుంది. దీనితో ఇప్పుడు రిలీజ్ డేట్ మార్చాలా.. వద్దా అన్న సంకోచంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం రిలీజ్ డేట్ ను మారుస్తారేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 13 =