‘నాంది’ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

Five Reasons To Watch Naandhi Movie,Allari Naresh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Allari Naresh Starrer Naandhi,Actor Allari Naresh,Hero Allari Naresh,Naandhi,Naandhi Movie,Naandhi Film,Naandhi Telugu Movie,Naandhi Movie Telugu,Five Reasons To Watch Allari Naresh Naandhi,Five Reasons To Watch Naandhi,Five Reasons To Watch Naandhi Movie,Five Reasons To Watch Naandhi Telugu Movie,5 Reasons To Watch Naandhi Movie,5 Reasons To Watch Naandhi,Naandhi Movie Plot,Allari Naresh Naandhi,Naandhi From Feb 19th,Naandhi Theatrical Release Tomorrow,Naandhi Movie Update,Naandhi Movie Ineresting Elements,Five Reasons To Watch Naandhi Film,Varalaxmi Sarathkumar

విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ ‘నాంది’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా డిఫరెంట్ కథతో వస్తున్నాడు నరేష్ . ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా పక్కా హిట్ కొడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. రేపు థియేటర్ లోకి రాబోతున్న ఈ సినిమా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందో లేదో చూడాలంటే మాత్రం ఒక రోజు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సినిమా చూడటానికి మాత్రం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. అవేంటో ఒకసారి లుక్కేద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* మొదటిగా చెప్పాలంటే ఈ సినిమాకు ఫస్ట్ హైలైట్ అల్లరి నరేష్. ఇప్పటివరకూ తన కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ చాలా సీరియస్ పాత్రతో వస్తున్నాడు. అయితే మధ్యలో అల్లరి నరేష్ గమ్యం, మహర్షి లో అలాంటి పాత్రలో చేసినా కూడా ఈ సినిమాలో మాత్రం ప్రత్యేకత ఉంది. ఈ సినిమాలో మొదటిసారిగా నగ్నంగా నటిస్తున్నాడు. ఒక రకంగా ఇదే ఈ సినిమాపై ఈ రేంజ్ లో అంచనాలు పెంచడానికి కారణం అయింది.

* వరలక్ష్మీ శరత్ కుమార్.. తమిళ్ లో పలు సినిమాల్లో నటించిన శరత్ కుమార్ డబ్బింగ్ సినిమాలతో అందరికీ సుపరిచితురాలే. ఇక తెలుగులో ఇటీవలే రిలీజ్ అయిన క్రాక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో లాయర్ గా మరో కీలక పాత్రలో నటిస్తుంది.

* మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మనకు తెలియని ఒక సెక్షన్ గురించి చెప్పబోతున్నారట. నిజానికి ఈ సెక్షన్స్.. దేనికి ఏ సెక్షన్ ఉంటుంది అనేది సామాన్య ప్రజలకు తెలియడం కష్టమే. తప్పు చేసిన వాళ్లకి ఎలాగూ శిక్షలు పడుతాయి.. కానీ ఒక్కోసారి చేయని వారు కూడా ఖైదీలుగా వుంటారు. తప్పు చేశారో? లేదో? తెలియకుండానే ఖైదీగా ఉంటారు. ఈ నేపథ్యంలో చట్టాల గురించి చూపించారు. ఓ సెక్షన్‌ గురించి స్పెషల్ గా చెప్పాం అని ఇప్పటికే నరేష్ చెప్పాడు. అదేంటో సినిమాలో చూసి తెలుసుకుంటారు.

* డైరెక్టర్ విజయ్ కనకమేడల కథ..ఒక డిఫరెంట్ కథతో వస్తున్నట్టు అర్ధమవుతుంది. మొదటి సినిమాతోనే ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు చాలా మంది డైరెక్టర్స్. హరీష్ శంకర్ దగ్గర పలు సినిమాలకు పనిచేసిన విజయ్ ఇప్పుడు ఈ సినిమాతో దర్శకుడిగా మారడు. మొదటి సినిమాతోనే అంచనాలు పెంచేసాడు.

* సతీష్‌ వేగేశ్న.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలను డైరెక్ట్ చేయడంలో సతీష్ వేగేశ్న దిట్ట. శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీశ్ వేగేశ్న. ఇక ఈ సినిమాతో మొదటిసారిగా నిర్మాతగా మరి ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇంకా ఈ సినిమాలో హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న అల్ల‌రి న‌రేష్ నాంది అనే చిత్రంతో ఎలా అయిన హిట్ కొట్టాల‌ని అనుకుంటున్నాడు. మరి చూద్దాం ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + twelve =