విద్యా వ్యవస్థలోని లోపాలను చెపుతున్న ‘అక్షర’

Akshara Movie Story To Highlight The Flaws In Education System,Nanditha Swetha Akshara Movie Trailer Is Out Now,Akshara,Akshara Movie,Akshara Telugu Movie,Akshara Trailer,Akshara Movie Trailer,Akshara Telugu Movie Trailer,Nanditha Swetha Akshara Trailer,Nanditha Swetha Akshara Official Trailer,Akshara Trailer Public Talk,Akshara Movie Trailer Public Talk,Akshara Telugu Movie Trailer Public Talk,Akshara Trailer Public Response,Akshara Movie Trailer Public Response,Akshara Telugu Movie Trailer Public Response,Akshara Movie Updates,Akshara Telugu Movie Latest News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nanditha Swetha Starrer Akshara Movie Trailer Released Now

మెసేజ్ ఓరియెంట్ సినిమాలు మనకు కొత్తేమి కాదు. ఇప్పటివరకూ అలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. అయితే అది ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడమే కొంచం కష్టం. అర్థమైందా సినిమా సక్సెస్ అయినట్టే. ఇక ఇప్పుడు అక్షర సినిమా ట్రైలర్ ను చూస్తే కూడా సినిమా మంచి విజయం సాధిస్తుందనే అంచనాలు వచ్చేసాయి. బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘అక్షర’. ఈ సినిమా ఫిబ్రవరి 26న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ ను చూసిన ఎవరికైనా అర్ధమవుతుంది ఇది విద్యాసంస్థల్లోని లోపాలను స్పష్టంగా చూపిస్తున్నారని. “విద్యను నమ్మినవాడు విజ్ఞాని అవుతాడు, విద్యను అమ్మినవాడు జ్ఞానాగ్నిలో దహించుకుపోతాడు, అఖిల విశ్వాన్ని శాసించేది అక్షరమే..” అనే పవర్ ఫుల్ డైలాగ్స్ తో అక్షర ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ప్రస్తుత కార్పొరేట్ విద్యాసంస్థల పిల్లల చదువులతో ఎలా వ్యాపారం చేస్తున్నాయి.. సీట్లు, ర్యాంకు అమ్మకాలు, ఆత్మహత్యలు.. ఇలా ప్రతి ఒక కోణాన్ని చూపించారు. ఇందులో హీరోయిన్‌ నందిత శ్వేత ఫిజిక్స్ టీచర్ గా నటిస్తూ ‌విద్యార్థులకు జరిగే అన్యాయాన్ని ఎదిరించే మహిళగా కనిపిస్తుంది.. విద్యార్థుల మానసిక ఒత్తిడిని తెర మీద చూపించేందుకు అక్షర చిత్రయూనిట్‌ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఈ విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా మాట్లాడే పాత్రలో హర్ష.. కాలేజ్ మాఫియాను నడిపించే పాత్రను సంజయ్ స్వరూప్.. పోలీస్ ఆఫీసర్‌గా శత్రు పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు. ట్రైలర్ చివర్లో జనాల్లోకి వెళ్ళాలి అన్న డైలాగ్ తోనే అర్ధమవుతుంది.. ప్రతి ఒక్కరికీ విద్యా వ్యవస్థలో జరిగే అన్యాయాలు గురించి తెలియాలని ఈ సినిమా తీస్తున్నట్టు. ప్రస్తుతం అయితే ఈ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంది. ఒక మంచి పాయింట్ తో ముందుకు వస్తున్నారని.. ప్రతి ఒక్క విద్యార్థి తల్లి తండ్రులు తప్పక చూడాల్సిన సినిమా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ట్రైలర్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంది మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే ఫిబ్రవరి 26 వరకూ ఆగాల్సిందే.


ఇంకా ఈసినిమాలో షకలక శంకర్, సత్య, మధునందన్ కీలక పాత్రల్లో నటిస్తున్న.. ఈ సినిమాను హాల్ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ లు కలిసి నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + eleven =