ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చూస్తాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘అరణ్య’, తమిళ్‌లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. నిజానికి ఈ సినిమా గత ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి వుంది. అయితే కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా డబ్బింగ్ లో బిజీ గా ఉన్నట్టు తెలిపాడు రానా. తను డబ్బింగ్ చెప్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేస్తూ.. అరణ్య డబ్బింగ్ జరుగుతుంది.. మొదటిసారి తెలుగు, హిందీ, తమిళ్ లో ఒకేసారి డబ్బింగ్ చెప్తున్నా అని పోస్ట్ లో పేర్కొన్నాడు.
Dubbing sessions for #Aranya / #HaathiMereSaathi / #Kaadan
Telugu Tamil Hindi dubbed and shot in 3 languages for the first time!! See you in cinemas March 26th@ErosNow #ComingSoon pic.twitter.com/E6V1zJbhuv
— Rana Daggubati (@RanaDaggubati) February 14, 2021
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇంకా ఈ సినిమాలో శ్రియ పిల్ గోవింకర్, పులకిత్ సామ్రాట్, జగపతి బాబు, పోసాని, విష్ణు విశాల్, మన్సూర్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు. ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో తన జీవితాన్ని ఎక్కువగా అడవికే అంకితం చేసి, అక్కడ నివసించే జంతువులను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఉండే బాణదేవ్ పాత్రలో రానా మనకు కనిపించబోతున్నారు. ఇదికాక రానా “విరాటపర్వం” మూవీ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: