‘రామ్-సునీత’ ల ‘వాలెంటైన్స్ డే’

Singer Sunitha and Ram Veerapaneni Valentines Day Special Interview By Anchor Suma,Singer Sunitha And Ram Veerapaneni First Ever Interview,Promo,Anchor Suma,Telugu Film Nagar,Singer Sunitha And Ram Veerapaneni First Ever Interview Promo,Singer Sunitha And Ram Veerapaneni First Ever Interview,Sunitha Ram First Ever Interview Promo,Singer Sunitha,Ram Veerapaneni,Singer Sunitha Ram Veerapaneni Interview,Singer Sunitha Marriage,Singer Sunitha Wedding,Singer Sunitha Husband,Ram Veerapaneni Interview,Telugu Movie Updates,Singer Sunitha Songs,Singer Sunitha Hits,Singer Sunitha Latest Interview,Tollywood Celebrity Interviews,Anchor Suma Shows,Anchor Suma Interview

డిజిటల్‌ కంపెనీ అధినేత రామ్‌ వీరపనేని, సింగర్‌ సునీత వివాహం ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే కదా. శంషాబాద్‌ దగ్గరలోని అమ్మపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వేదికగా వీరి పెళ్లి జరిగింది. ఘనంగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, శ్రేయోభిలాషులు.. టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన సునీత ప్రస్తుతం భర్త రామ్ వీరపనేనితో కలిసి కొత్త జీవితం ఎంజాయ్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా పెళ్లి తరువాత వస్తున్న తొలి వాలెంటైన్స్‌ డే కావడంతో తాజాగా ఈ ఇద్దరూ పెళ్లి తర్వాత తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. వాలెంటైన్స్ డే సందర్భంగా యాంకర్ సుమ కొత్తజంటను ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబందించిన ప్రోమో కూడా తెలుగుఫిలింనగర్ యూ ట్యూబ్ ఛానల్ లో రిలీజ్ అయింది.

ఇక సుమ యాంకరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అందులోనూ సునీత ఫ్రెండ్ కూడా కాబట్టి ప్రోమో కూడా చాలా సరదాగా ఉంది. ప్రోమో చూస్తే.. సుమ పలు ఇంట్రెస్టింగ్ విషయాలే బయటకు లాగినట్టు కనిపిస్తుంది. అసలు ఎలా మొదలైంది అంటూ సుమ అడిగిన ప్రశ్నకు.. సునీత ఇంకేంటి.. అంటూ తమ మధ్య పరిచయం మొదలైందని.. ఎప్పుడు కలిసినా ఇంకేంటి అనే వాడని చెప్పుకొచ్చింది సునీత. ఆ ఇంకేంటిలోనే ఎన్నో అర్థాలు ఉండేవని తర్వాత అర్థమైనట్లు చెప్పింది సింగర్ సునీత. లాక్ డౌన్ ముందు వరకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే తనకు లేదని.. కానీ లాక్‌డౌన్‌లోనే ఏదో జరిగిపోయింది అంటుంది సునీత. మరి ఇంటర్వ్యూలో ఇంకెన్ని విషయాలు తెలుస్తాయో చూద్దాం. మరి ఇంటర్వ్యూ చూడాలంటే మాత్రం ఫిబ్రవరి 14 వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =