రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డేల కాంబినేషన్ లో ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఇక ఇప్పటికే వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఆ సర్పరైజ్ కు మరికొద్ది గంటలు మాత్రమే ఉంది. మరోవైపు పూజా హెగ్డే కూడా ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు ఇన్స్టా ద్వారానో.. ట్విట్టర్ ద్వారానో తెలియచేస్తూనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు సంబంధించి ఫొటోలు పోస్ట్ చేసింది. షేడ్స్ ఆఫ్ ప్రేరణ అని.. రెండు ఫొటోలు పోస్ట్ చేసి.. దానికి సోషల్ మీడియా వర్సెస్ రియాలిటీ అంటూ పోస్ట్ లో పేర్కొంది. ఇక ఈ ఫొటోలో ప్రేరణ ఎవరి కోసమో వేచి చూస్తున్నట్టే కనిపిస్తోంది. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. పూజా హెగ్డే .. ప్రేరణ అనే పాత్రలో కనిపించనుంది.
Social Media Vs Reality 😂 #ShadesOfPrerana #RadheShyam #BTS #Swipeleft⬅️ #Freezing pic.twitter.com/Tosn2DfASz
— Pooja Hegde (@hegdepooja) February 12, 2021
కాగా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించనుండగా… రాధే శ్యామ్ హిందీ వెర్షన్ కు మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























