2021.. డిఫరెంట్ రోల్స్ తో జగ్గూ భాయ్

Actor Jagapathi Babu To Entertain Audience With Versatile Roles In 2021,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Jagapathi Babu,Actor Jagapathi Babu,Jagapathi Babu 2021 Calendar Packed With Versatile Roles,Jagapathi Babu 2021 Movies,Jagapathi Babu Movies,Jagapathi Babu Movies 2021,Jagapathi Babu Films 2021,Madhagaja,Roberrt,Republic,Ghani,Ghani Movie,Lakshya,Maha Samudram,Tuck Jagadish,Happy Birthday Jagapathi Babu,Jaggu Bhai Power Packed 2021,Jagapati Babu Upcoming Movies 2021,Mahesh Babu Upcoming Movies 2021,Jagapathi Babu Upcoming Movies List 2021,Jagapathi Babu New Movies List,Jagapathi Babu Versatile Roles In 2021

ఒకప్పుడు కుటుంబకథా చిత్రాలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి…ఇప్పుడు విలన్ గా, ఫాథర్ గా దూసుకుపోతున్నాడు జగపతి బాబు. గతంలో ఫ్యామిలీ సినిమాలంటే జగపతిబాబు సినిమాలే గుర్తొచ్చేవి. ఆ తరువాత యంగ్ హీరోలు రావడం… సినిమా ఛాన్స్ లు తగ్గడం.. దానికి తోడు ఆర్ధిక సమస్యలు కూడా రావడంతో సరైన బ్రేక్ కోసం ఎదురుచూశాడు జగ్గూభాయ్. చాలా గ్యాప్ తర్వాత లెజెండ్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.. ఆ సినిమా హిట్టవ్వడంతో జగపతి బాబుకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఒకపక్క విలన్ పాత్రలు చేస్తూనే… మరోపక్క ఫాథర్ పాత్రలు కూడా చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో బెస్ట్ ఛాయిస్ గా మారిపోయాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ.. విభిన్నమైన కథలతో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఈ ఏడాది డైరీ కూడా జగ్గూ భాయ్ డైరీ డిఫరెంట్ సినిమాలతో నిండిపోయింది. ఇక జగపతి పుట్టిన రోజు సందర్భంగా తను సినిమాల నుండి జగ్గూ భాయ్ లుక్స్ ను రిలీజ్ చేశారు.

టక్ జగదీష్

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా టక్ జగదీష్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాలో జగపతి బాబు కూడా ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని అన్నగా జగపతి బాబు నటిస్తున్నట్టు రిలీజ్ చేసిన పోస్టర్ ను బట్టి అర్ధమవుతుంది.

లక్ష్య
సంతోష్ జాగర్ల మూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా లక్ష్య సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా లో కూడా జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆర్చరీ కోచ్ పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు..

గని
కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో గని సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో జగపతి బాబు విలన్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

రిపబ్లిక్
సాయి తేజ్ ప్రస్తుతం దేవ కట్టా తో ‘రిపబ్లిక్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో కూడా జగపతి బాబు మరో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.

మదగజరాజ
తెలుగులోనే కాదు తమిళ్, కన్నడలో కూడా జగపతి బాబు నటిస్తున్నాడు. మహేష్ కుమార్ దర్శకత్వంలో మదగజరాజ సినిమాలో నటిస్తున్నాడు.

రాబర్ట్
దర్శన్ హీరోగా కే.సుధీర్ దర్శకత్వంలో రాబర్ట్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో కూడా జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

[subscribe]
 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.