సుజనా రావు దర్శకత్వంలో శ్రియ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘గమనం’. చాలా గ్యాప్ తర్వాత శ్రియ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లను, టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో శ్రియ చెవిటి యువతిగా.. సాధారణ గృహిణి పాత్రలో నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసారు చిత్రయూనిట్. మార్చి 19న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. మరి ఇప్పటికే మార్చి 19వ తారీకున మంచు విష్ణు నటించిన మోసగాళ్లు మరియు కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ రెండు సినిమాలకు గమనం ఎంత పోటీ ఇస్తుంది అనేది చూడాలి.
ఇంకా ఈ సినిమాలో నిత్యా మీనన్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా ఈ చిత్రానికి పనిచేస్తున్న జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మాత అవతారం కూడా ఎత్తి, రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: