టక్ జగదీష్ – ‘ఇంకోసారి ఇంకోసారి’ ఫస్ట్ లిరికల్ రిలీజ్

Inkosaari Inkosaari First Single From Tuck Jagadish Movie Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Inko Saari Song,Tuck Jagdish Movie Songs,Tuck Jagdish Songs,Nani Tuck Jagadhish,Nani Latest Movie,Nani Latest Songs,Nani New Songs,Nani Songs 2021,Telugu Songs,Latest Telugu Songs,Thaman Songs,Tuck Jagdish Songs,Tuck Jagadish Nani New Movie,Ritu Varma,Inkosaari Inkosaari​ Lyrical,Tuck Jagadish Movie Songs,Nani,Shiva Nirvana,Thaman S,Natural Star Nani,Inkosaari Inkosaari First Single,Tuck Jagadish Telugu Movie,Inkosaari Inkosaari First Single Out,Inkosaari Inkosaari

స్పెషల్ డేస్ లో మూవీస్ నుండి అప్ డేట్స్ రావడం కామన్. ఇక రేపు వాలెంటైన్స్ డే సందర్భంగా చాలా సినిమాల నుండి వరుస పెట్టి సినిమాలు రానున్నాయి. ఇక టక్ జగదీష్ నుండి ఒక రోజు ముందే అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి ఈ రోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తామని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. చెప్పినట్టే ఈ రోజు ‘ఇంకోసారి ఇంకోసారి’ అనే మెలోడీ పాటను రిలీజ్ చేశారు. లిరికల్ పాటను మాత్రమే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. గుమ్మడి వరలక్ష్మి.. గుమ్మ.. ఏ నచ్చలేదా? అంటూ నాని అడిగిన ప్రశ్న… దానికి రీతూ వర్మ నచ్చింది అంటూ చెప్పడం.. థమన్ సంగీతం.. శ్రేయా ఘోషల్, కాల భైరవ గాత్రం.. అన్నీ ఆకట్టుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘నిన్నుకోరి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ త‌ర్వాత న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా ఇది. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. అంతేకాదు చాలా కాలం తర్వాత మళ్లీ మాస్ అండ్ కమర్షియల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నాడు నాని. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 23 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్.

కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =