వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ‘ఎఫ్2’. ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ ఏఫ్3 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వెంకీ, వరుణ్ ఇద్దరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఇప్పుడు ప్రధాన తారాగణం మొత్తం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. ఫన్ ఫ్యామిలీ ఈజ్ బ్యాక్.. అంటూ సెట్ లో ఉన్న ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటోలో వెంకటేష్, తమన్నా, అన్నపూర్ణమ్మ, వై.విజయ, ప్రగతి, రఘుబాబు, ప్రదీప్, నిర్మాత శిరీష్ తదితరులు వున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“FUN FAMILY” is back again…
Get ready for the joy ride 😉😉#F3Movie@VenkyMama@IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official pic.twitter.com/tQQbnqv0sM— Anil Ravipudi (@AnilRavipudi) February 1, 2021
కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 27న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: