‘F3’ లో మూడో హీరో పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Director Anil Ravipudi Gives Clarity About The Third Hero In F3 Movie,Anil Ravipudi,Director Anil Ravipudi,F3,F3 Movie,F3 Film,F3 Telugu Movie,F3 Movie Telugu,F2 Movie Sequel,Venkatesh Daggubati,Varun Tej,Tamannaah,Mehreen Pirzada,Anil Ravipudi Directorial F3 Movie,F3 Shooting Schedule,Anil Ravipudi Latest Movie,Director Anil Ravipudi About F3,Anil Ravipudi On F3,Third Hero In F3 Movie,F3 Movie Third Hero,Anil Ravipudi Gives Clarity About F3 Third Hero,Anil Ravipudi F3 Movie,Anil Ravipudi Gives Clarity On Third Hero In F3,F3 Movie Updates,F3 Movie News,Anil Ravipudi New Movie

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్2’. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వెంకీ, వరుణ్ ఇద్దరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మూడో హీరో కూడా ఉన్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో రవితేజ అన్నారు.. ఇటీవల మరో మెగా హీరో అన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలపై ఒక క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో మూడో స్టార్ హీరోగా ఎవరూ చేయడం లేదని, అసలు మూడో హీరో అన్న ఆలోచన కూడా తనకు లేదని అనిల్ తేల్చి చెప్పాడు. అంతేకాకుండా ఎఫ్2ను ఇద్దరితోనే ముగించానని అలాగే ఎఫ్3ని కూడా వారితోనే ముగిస్తానని క్లారిటీ ఇచ్చాడు. మరి ఇప్పుడైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం.

కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − five =