తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈటీవీ లో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్, పోవేపోరా, ఢీ ఇలా ఎన్నో టీవీ షోలతో మెప్పించిన ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతంచేసుకున్నాడు. ఇక బుల్లితెరపై తన సత్తా చాటిన సుధీర్ వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పులిచర్ల రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో సుడిగాలి సుధీర్, ధన్యబాలకృష్ణ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్. ఇంకా ఈ సినిమాలో నాజర్, ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే, పృథ్వీ, గద్దర్, శివప్రసాద్ తదితరులు నటించారు. శేఖర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. శేఖర్ రాజు నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాలో అమాయకుడైన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా సుధీర్ నటన ఆకట్టుకుంటుంది. బుల్లితెరపై పంచ్‌లు వేసే సుధీర్ ఈ సినిమాలోనూ అదే స్థాయిలో కామెడీని పండించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమానుండి బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ మీకోసం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: