ప్రభాస్, త్రిష కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో మొదటగా వచ్చిన ‘వర్షం’ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇద్దరి కెరీర్ కు బ్రేక్ ఇచ్చిందని చెప్పొచు. రెండో సినిమా ‘పౌర్ణమి’ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమానే ‘బుజ్జిగాడు’. ఇక ఈసినిమాలో తనలో ఉన్న కామెడీ యాంగిల్ నుచూపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తనలోని కామెడీ యాంగిల్ ను చూపించిన సినిమా మాత్రం బుజ్జిగాడు అని చెప్పొచ్చు. అప్పటివరకూ ప్రభాస్ తన కెరీర్ లో అన్ని రకాల ఎమోషన్స్ ను చూపించాడు కానీ కామెడీని అంత ఎక్కువగా చేసింది లేదు. బుజ్జిగాడు చిత్రంలో ప్రభాస్ పాత్రే మాగ్జిమమ్ ఎంటర్టైన్మెంట్ ను పంచుతుంది. మేకోవర్ పరంగా ప్రభాస్ కెరీర్ లో బుజ్జిగాడు చాలా ముఖ్యమైన చిత్రం. ప్రభాస్ డైలాగ్ డెలివరీ, మోడ్యులేషన్, మ్యానరిజమ్స్ ఇలా అన్నిట్లోనూ కొత్తదనం తీసుకొచ్చిన సినిమా బుజ్జిగాడు. ఇక ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమా నుండి కామెడీ సీన్స్ మీకోసం. కింద లింక్ క్లిక్ చేసి నవ్వుకోండి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: