‘సోలో బ్రతుకే సో బెటర్’ – తొలి చిత్రం.. ఎంతో ముఖ్యం

Chiranjeevi About Solo Brathuke So Better,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Movies Updates,Tollywood Movie Updates,Latest Tollywood News,2020 Telugu Movies News,Solo Brathuke So Better,Solo Brathuke So Better Movie,Solo Brathuke So Better Telugu Movie,Megastar Chiranjeevi About Solo Brathuke So Better,Chiranjeevi About Solo Brathuke So Better Movie,Chiranjeevi About Solo Brathuke So Better Telugu Movie

కరోనా వల్ల ఇన్ని నెలలు థియేటర్స్ మూత పడగా ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. పెద్దఎత్తున కాదు కానీ మల్టీ ప్లెక్స్ లు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకొని థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్రిస్మస్ కు సంక్రాంతికి అప్పుడే చాలా సినిమాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే అన్ని సినిమాల భవిష్యత్తు మాత్రం ఒక్క సినిమా టాక్ పైనే ఉందని చెప్పొచ్చు. అదే మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా. ఈ సినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పరిస్థితులు కాస్త విభిన్నంగా ఉన్నాయి కాబట్టి అందరూ సినిమాకు వస్తారా లేదా.. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా చిరు కూడా ఈసినిమా టీంకు విషెస్ అందించారు. ‘ఈ క్రిస్మస్ కు విడుదలవుతున్న ‘సోలో బ్రతుకే సో బెటరే’ టీమ్ కు నా శుభాకాంక్షలు.. లాక్ డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రంగా ఇది మొత్తం ఫిలిం ఇండస్ట్రీకే ఒక ముఖ్యమైన సందర్భం.. ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్ఫూర్తిని స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.. అలాగే ప్రేక్షకులందరూ.. బాధ్యతగా ఫేస్ మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ.. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.

కాగా సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా వస్తుంది. ఇక ఇప్పటివరకూ రిలీజ్ చేసిన సాంగ్స్, ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక డిసెంబర్ 25న థియేటర్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు.

కాగా `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక లాక్‌డౌన్ తరవాత థియేటర్లలో విడుదలవుతోన్న సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − seven =