రష్మిక బాలీవుడ్ ఎంట్రీ – న్యూ జర్నీ స్టార్ట్

Rashmika Mandanna to make her Bollywood Entry,2020 Telugu Movies News, latest telugu movies news, Latest Tollywood News, Rashmika Mandanna, Rashmika Mandanna Latest Film Details, Rashmika Mandanna Latest News, Rashmika Mandanna New Movie News, Rashmika Mandanna Next Project News, Rashmika Mandanna To Star Opposite Siddharth Malhotra In Her Debut Bollywood Film Mission Majnu, Rashmika Mandanna Upcoming Movie News Cards, Telugu Filmnagar, Telugu Movies Updates, Tollywood Movie Updates

ఒక పక్క టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో దూసుకుపోతూనే మరోపక్క అన్ని లాంగ్వేజెస్ లో కూడా తన మార్క్ ను చూపించడానికి ట్రై చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్పలో నటిస్తుంది. ఈ సినిమాలోకూడా రష్మిక పాత్ర హైలైట్ అని చెపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా రెమో ఫేమ్‌ బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా ‘సుల్తాన్’. ఫ్యామిలీ, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌ర్‌గా తెర‌కెక్కుతున్న సుల్తాన్ సినిమాతో రష్మిక త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్ట‌నుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తుండగా..రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్ఎస్‌వీపీ మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. శాంతను బాగ్చి దర్శకత్వంలో వస్తున్న సినిమాతో న్యూ జర్నీ స్టార్ట్ చేయబోతున్న రష్మిక..ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్ వేదికగా తెలిపింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 14 =