ఫన్ మొదలు.. F3 సెట్ లో వెంకీ

Anil Ravipudi's F3 Movie Shoot Begins,2020 Telugu Movies News, F3, F3 Movie, F3 Movie Shooting Updates, F3 Shooting Updates, F3 Telugu Movie, F3 Telugu Movie Shooting Latest News, Latest Telugu Movies News, Latest Tollywood News, Special Set for Venkatesh & Varun Tej’s F3 Movie, Special Set for Venkatesh And Varun Tej’s F3 Movie, Telugu Filmnagar, Telugu Movies Updates, Tollywood Movie Updates

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్2’. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లడమే లేట్. వెంకటేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. మొదటి రోజు షూటింగ్‌లో విక్టరీ వెంకటేష్ పాల్గొన్నాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. ఆ స్పెషల్ సెట్‌లో వెంకటేష్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. మరికొన్ని రోజుల్లో ఇతర నటీ నటులు ఈ చిత్రీకరణలో పాల్గొంటారట.

కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =