వైల్డ్ డాగ్.. త్వరలో రిలీజ్ – థ్యాంక్యూ నాగార్జున సార్

Ali Reza Thankful Tweet To Nagarjuna,2020 Telugu Movies News, ali reza, Ali Reza Thankful To Nagarjuna, From Boss To Wild Dog ; Ali Reza Is Thankful To Nagarjuna For The Opportunity, latest telugu movies news, Latest Tollywood News, Nagarjuna, Telugu Filmnagar, Telugu Movies Updates, Tollywood Movie Updates

అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక థియేటర్స్ ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను కూడా త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో అలీ రెజా నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి అలీ రెజా మాట్లాడుతూ తన ట్విట్టర్ లో తన జర్నీ గురించి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ లో ప్రతి నిమిషం ఎంజాయ్ చేసాను.. కింగ్ నాగార్జున గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అన్న డ్రీం నిజమైంది.. 2006 లో వచ్చిన బాస్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా ఒక చిన్న పాత్రలో చేసాను.. దాదాపు 14 ఏళ్ల అయింది.. ఎప్పుడూ నేను వదిలిపెట్టలేదు.. ప్రతిరోజూ నా డ్రీమ్స్ ను ఫిల్ చేసుకోడానికి చాలా కష్టపడ్డాను.. బిగ్ బాస్ లో ఉన్న నన్ను ఈ సినిమా కోసం తీసుకున్న నాగార్జున గారికి థాంక్యూ అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

కాగా య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మగా నాగార్జున నటిస్తున్నాడు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న స‌యామీ ఖేర్, అలీ రెజా, మ‌యాంక్ ప్ర‌కాశ్ ప‌లువురు నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =