బిగ్ బాస్ 4 – ఎన్నో ఎమోషన్స్ కలయికనే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో. ఇన్ని రోజులు ఆడియన్స్ ను అలరించిన ఈ షో ఇంకా మూడు మూడు రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎలాగూ ఆఖరి అంకానికి చేరుకుంది కాబట్టి పెద్దగా గేమ్స్ లాంటివి పెట్టకుండా హౌస్ మేట్స్ కు రెస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నిన్న ఎపిసోడ్ లో కూడా పెద్దగా జరిగింది ఏం లేదనే చెప్పొచ్చు. వారి జర్నీలు మాత్రం చూపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పటివరకు ఆడించిన టాస్కులకు సంబంధించి అన్ని వస్తువులను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ముందుగా అఖిల్‌ను పిలిచి అతడి జర్నీ వీడియో ప్లే చేశారు. ఇందులో అఖిల్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండి.. మోనాల్‌తో ఆటపాటలు, అభితో గొడవలు, సోహైల్ త్యాగాలు అన్నీ చూపించడంతో అఖిల్ కంటతడి పెట్టుకున్నాడు. తను ఎఫర్ట్స్ పెట్టి ఆడానని అఖిల్ మరోసారి స్పష్టం చేశాడు. గెలుపోటములు తన చేతిలో లేవని, కానీ ప్రయత్నం మాత్రం ఎప్పటికీ మానుకోలేదని చెప్పాడు. తోడు కోసం పరితపించాను కానీ ప్రేక్షకుల ఓట్ల రూపంలో అంత ప్రేమ వచ్చినప్పుడు ఇంకా ప్రేమ కావాలనుకోవడం ఫూలిష్‌నెస్ అనిపిస్తోందన్నాడు. తనకీ ప్రేక్షకుల ప్రేమ చాలు అంటూ మోకాళ్లపై మోకరిల్లి ఓట్లేసిన వారికి ధన్యవాదాలు తెలిపాడు. బిగ్‌బాస్ వల్ల తనేంటో తనకు తెలిసిందని, తప్పకుండా విన్నర్ అవుతానన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు.
ఆ తర్వాత అభిని పిలిచాడు బిగ్ బాస్. బిగ్‌బాస్ అతడికి “మెచ్యూర్డ్ మ్యాన్ ఆఫ్ ద హౌస్” బిరుదునిచ్చాడు. నీ కంటే ఎక్కువగా వేరేవాళ్లకోసం ఆలోచించావని అభిని మెచ్చుకున్నాడు. ఇలాంటి పరిపక్వత చెందిన తెలివైన కంటెస్టెంటు హౌస్‌లో ఉన్నందుకు గర్వపడుతున్నానని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో అభి చేతులెత్తి నమస్కరిస్తూ.. నేను బిగ్‌బాస్‌కు రావడం అనేది నా జీవితంలోనే సరైన నిర్ణయం అని భావిస్తున్నాను అని తెలిపాడు. అనంతరం అతడికి జర్నీ వీడియో చూపించాడు. అందులో అభి మోనాల్ కబుర్లు.. కొన్ని కారణాల వల్ల ఆమెతో దూరం కావడం, అఖిల్‌తో గొడవలు, నామినేషన్లు అన్నింటినీ చూపించారు. హారిక ఫ్రెండ్షిప్ ఇవన్నీ చూపించారు. వీడియోనుచూసి అభి కూడా కాస్త ఎమోషన్ అయ్యాడు.
ఇక ముగ్గురి ఇంటిసభ్యులు మిగిలారు. అరియానా, సోహెల్, హారిక వీడియోస్ ఈ రోజు చూపిస్తారు. మరి ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా హౌస్ లో ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. చూద్దాం మరి ఈ రోజు చూపిస్తారా? రేపా? అన్నది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: