సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత ఎంత సింపుల్ గా ఉంటారో అందరికీ తెలుసు. స్టార్ హీరో భార్య అయినా కూడా చాలా సింపుల్ గా వుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా కూడా నమ్రత ఎంతో యాక్టీవ్ గా ఉంటారు. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా నమ్రత మరో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో నమ్రత వారి ఫాంలో పండిన టమాటాలు, ఎర్ర మిరపకాయలు చూపించారు. అంతేగాక కోసిన వరిపంట చూపిస్తూ వీడియోకు.. ‘పొలంలో పండిన వాటి కంటే తాజా కూరగాయలు ఇంకేముంటాయి. ఐ లవ్ ఇట్’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.
View this post on Instagram
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. మహేష్ సరసన ‘మహానటి’ కీర్తి సురేశ్ నటిస్తున్నారుత్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ హైదరాబాద్లో షూటింగ్ షెడ్యూల్ జరుపుకుని ఆ తర్వాత ఆమెరికా వెళ్లనుంది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























