‘మాస్టర్’ రిలీజ్ కు స్పెషల్ డేట్..?

Actor Thalapathy Vijay, Actor Vijay Sethupathi, Anirudh Ravichander, Director Lokesh Kanagaraj, Hero Thalapathy Vijay, Hero Vijay Sethupathi, latest telugu movies news, Latest Tollywood News, Lokesh Kanagaraj, master, Master Film, Master Movie, Master Movie News, Master Movie Updates, Telugu Film News 2020, Telugu Filmnagar, thalapathy vijay, Thalapathy Vijay Starrer Master, Thalapathy Vijay’s Master Selfie Smashes Yet Another Record, Tollywood Movie Updates, Vijay Sethupathi

తమిళ్ స్టార్ హీరో విజయ్ తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే విజయ్ సినిమా కోసం తమిళ్ ప్రేక్షకులు ఎంత ఎదురుచూస్తారో.. తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక ఇప్పుడు అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘మాస్టర్’. లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇటీవల చిత్రయూనిట్ ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమా ట్రయిలర్ ను న్యూ ఇయర్ రోజు రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాను 2021 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు గతకొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే సంక్రాంతికి అన్నారు కానీ డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు. అయితే ఇప్పుడు ఆ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. జనవరి 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈ సినిమాలో విజయ్‌ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోను కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా .. కాలేజ్ ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 18 =