కరోనాకు గురవుతున్న సెలబ్రిటీస్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎంతోమంది ఈ కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా.. మరికొంత మంది మృతి చెందారు కూడా. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం కాస్త తగ్గుతుంది. సినిమాల షూటింగ్ లు కూడా మొదలయ్యాయి. ఎలాంటి నిర్లక్యం చేయకుండా కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే సినిమా షూటింగ్ లు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఎంత కరోనా ప్రభావం తగ్గుతున్నా సినీ సెలబ్రిటీస్ ను మాత్రం కరోనా వదిలిపెట్టేలా కనిపించట్లేదు. విచిత్రం ఏంటంటే కరోనా లక్షణాలు కనిపించకుండా కూడా కరోనా పాజిటివ్ రావడం. ఇప్పుడు మరో సెలెబ్రిటీకి కూడా అలానే కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. తమిళ సినీ నటుడు శరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా లక్షణాలు ఏమీ లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన భార్య రాధికాశరత్‌కుమార్ తెలిపారు. శరత్‌కుమార్ ప్రస్తుతం బాగానే ఉన్నారని.. కోలుకుంటున్నారని ఆమె తన ట్వీట్ ద్వారా తెలిపారు.
Today Sarath tested positive for Coronavirus in Hyderabad. He’s asymptomatic and in the hands of extremely good doctors! I will keep you updated about his health in the days to come. @realsarathkumar @rayane_mithun @imAmithun_264 @varusarath5
— Radikaa Sarathkumar (@realradikaa) December 8, 2020
కాగా ఇటీవల శరత్ కుమార్ జిమ్‌లో డంబెల్స్‌తో ఫోజిచ్చిన ఫొటో వైరలయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరత్ కుమార్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పొన్నియిన్ సెల్వన్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























