శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు సుధాకర్. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ సుధాకర్ మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’, ‘నువ్వు తోపురా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
ఇక ఇప్పుడు నువ్వు తోపురా సినిమాకు అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమా అమెరికాలో అరుదైన అవార్డ్ ను సొంతం చేసుకుంది. యూటా ఫిలిం ఫెస్టివల్ 2020 లో మేడ్ ఇన్ యూటా ఫీచర్ కేటగిరీలో బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డును దక్కించింది. కాగా హరినాథ్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్య హీరోయిన్ గా నటించింది. యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డీ శ్రీకాంత్ నిర్మించిన ఈసినిమాలో 90 దశకాల్లో యువతను ఆకట్టుకొన్న హీరోయిన్ నిరోషా ప్రధాన పాత్రలో నటించింది.
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ‘రీసెట్’ అనే మరో విభిన్నమైన చిత్రం చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారా అజ్జు మహాకాళి దర్శకునిగా పరిచయమౌతున్నారు. సుఖ స్టూడియోస్ సమర్పణలో హైలైట్ విజువల్స్, కారా బూందీ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇటీవలే సుధాకర్ కోమాకుల పుట్టినరోజు సందర్బంగా టైటిల్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.