భీం టీజర్ పై తారక్-ఎన్టీఆర్ కామెడీ

NTR and RamCharan Share Fun Banter With Each Other Over Bheem Teaser

ఎన్టీఆర్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న టైం రానే వస్తుంది. ఇక ఎదురు చూస్తున్న అభిమానులకు తమ ట్వీట్స్ తో ఇంకా క్యూరియాసిటీ పెంచుతున్నారు రామ్ చరణ్-ఎన్టీఆర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరిట చెర్రీ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు చరణ్ వంతు వచ్చింది. రామరాజు ఫర్ భీం పేరుతో ఎన్టీఆర్ కు గిఫ్ట్ ఇవ్వనున్నాడు. దీనికి ముహూర్తం కూడా పెట్టారు. ఈ నెల 22న అంటే రేపు ఈ టీజర్ ను విడుదల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ టీజర్ కు సంబంధించి చిన్న క్లిప్‌ను చరణ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. ఈ సందర్భంగా చరణ్-తారక్ మధ్య చిన్న కామెడీ సంభాషణే జరిగింది. ఇక ఈ క్లిప్ పోస్ట్ చేస్తూ ‘బ్రదర్ తారక్ నీకోసం ఒకటి విడుదల చేస్తున్నాను. కానీ, నీలా కాకుండా సరైన సమయానికి నీ టీజర్ ను విడుదల చేస్తాను’ అని చెర్రీ అన్నాడు.

 

మరి దీనికి చరణ్ ఊరుకుంటాడా. తారక్ కు కౌంటర్ ఇచ్చాడు. ‘బ్రో… నువ్వు ఓ విషయాన్ని గుర్తిస్తావని ఆశిస్తున్నాను.. నువ్వు ఆల్రెడీ ఐదు నెలలు ఆలస్యం చేశావు.. ఇప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగానే ఉండాలి.. ఎందుకంటే జక్కన్నతో వ్యవహారం.. ఏదైనా జరగొచ్చు’ అని చెప్పాడు.

 

కాగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఈ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయనున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.