సూపర్ స్టార్ ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉండటం ఎప్పుడో చాలా రేర్ గా చూస్తాం. ఇక తాజాగా వీరంతా ఒకటే చోట కలుసుకోవడం జరిగింది. ఇంతకీ ఏ సందర్భంలో అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఈ రోజు కృష్ణ చిన్న కుమార్తె, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యామిలీ అంతా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్‌లో సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్, నమ్రత, సంజయ్ స్వరూప్, జయదేవ్, సుధీర్‌బాబు అందరూ పాల్గొన్నారు. కేక్ కట్ చేయడంతో పాటు అందరూ కలిసి భోజనం చేశారు. ఇక ఈ విషయం సుధీర్‌బాబు ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. “ఈరోజు నా లైఫ్ పుట్టినరోజు. హ్యాపీ బర్త్‌డే ప్రియా” అనే మెసేజ్‌తో పాటు ఫ్యామిలీ అందరూ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ తెరకు పరిచయమైన సుధీర్ బాబు… ఆ తరువాత హీరోగా పలు విభిన్నమైన స్టోరీలు ఎంపికచేసుకుంటూ తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ మధ్య సమ్మెహనం, నన్నుదోచుకుందువటే సినిమాలతో మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకోగా ఇటీవలే ‘V’ సినిమాతో మరోసారి తనేంటో నిరూపించుకున్నాడు.
It’s that date … love of my life was born. Happy Birthday priya ❤️ pic.twitter.com/7GWztK3LVf
— Sudheer Babu (@isudheerbabu) October 7, 2020
ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం పలాస ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహించనున్న సినిమాలో సుధీర్‌బాబు నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గ్రామీణ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నట్టు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: