తెలుగు అమ్మాయి పాత్రలో సీరత్ కపూర్

Actress Seerat Kapoor To Play Telugu Speaking Girl In Her Upcoming Movie

మోడల్ , డ్యాన్సర్ ,క్లాసికల్ సింగర్ , యాక్ట్రెస్ , కొరియోగ్రాఫర్ సీరత్ కపూర్ బ్లాక్ బస్టర్ “రాక్ స్టార్ ” హిందీ మూవీ కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. సూపర్ హిట్ “రన్ రాజా రన్ ” మూవీ తో హీరోయిన్ గా సీరత్ కపూర్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “టైగర్ “, “కొలంబస్ “,
“రాజు గారి గది 2”, “టచ్ చేసి చూడు ” వంటి మూవీస్ తో సీరత్ ప్రేక్షకులను అలరించారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన “కృష్ణ అండ్ హిజ్ లీల ” మూవీ లో సీరత్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీరత్ హీరోయిన్ గా నటించిన “మా వింత గాథ వినుమా ” మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ కారణంగా 6 నెలలపాటు ఇంటికే పరిమితం అయిన సీరత్ త్వరలో సెట్స్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సీరత్ కపూర్ మాట్లాడుతూ .. “కృష్ణ అండ్ హిజ్ లీల “మూవీ లో ఆధునిక భావాలు ఉన్న యువతిగా నటించాననీ , “మా వింత గాథ వినుమా ” మూవీ లో క్రమ శిక్షణ , నిర్దిష్టమైన లక్ష్యాలతో సాంప్రదాయాలకు విలువనిచ్చే తెలుగు అమ్మాయిగా నటించాననీ , లాక్ డౌన్ సమయం లో కొన్ని స్క్రిప్ట్స్ విన్నాననీ , తాను నటించే సినిమాల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాననీ సీరత్ చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − five =