రవిబాబు ‘క్రష్’ టీజర్ రిలీజ్

Director Ravi Babu Crrush Movie Teaser Is Out

టాలీవుడ్ లో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్స్ లో రవి బాబు కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేయకుండా… డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు. తన మొదటి సినిమా అల్లరి దగ్గర నుండి మొన్న వచ్చిన ఆవిరి సినిమా వరకూ ప్రతి సినిమాలోనూ వైవిధ్యతను చూపించడం రవిబాబు ప్రత్యేకత. తన క్రియేటివిటీనే తనను ప్రేక్షకులకు దగ్గర చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల ‘అదుగో’ అంటూ పంది పిల్లతో తీసిన ప్రయోగాత్మక చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. ‘ఆవిరి’ అంటూ హారర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించినా అది కూడా విజయం దక్కించుకోలేక పోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు యూత్ ను టార్గెట్ చేస్తూ అడల్ట్ కంటెంట్‌తో ‘క్రష్’ అనే సినిమాను తీశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ను రవిబాబు దాదాపు పూర్తి చేసాడు. ఇక కరోనా సమయంలో కూడా కరోనాను కూడా వాడుకొని ప్రమోషన్స్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసాడు. ఇక టీజర్ ను చూస్తుంటే పూర్తిగా అడల్ట్ కంటెంట్‌తో యూత్‌ను టార్గెట్ చేసుకుని తీసినట్లు తెలుస్తోంది.

తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైదీ సంగీతం అందిస్తుండగా.. ఎన్.సుధాకర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న రవిబాబు ఈ సినిమాతోనైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =