“ఎవరే అతగాడు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ మూవీస్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించారు. “పరుత్తి వీరన్ “తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ప్రియమణి ప్రస్తుతం “విరాటపర్వం “, “నారప్ప ” మూవీస్ తో పాటు ఒక కన్నడ , ఒక హిందీ మూవీ లో నటిస్తున్నారు. ప్రియమణి ఇప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫిల్మ్ నాటీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రియమణి ప్రధాన పాత్రలో వివేక్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ “కొటేషన్ గ్యాంగ్ ” మూవీ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో తెరకెక్కుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న”కొటేషన్ గ్యాంగ్ ” మూవీ లో ప్రియమణి కాంట్రాక్ట్ కిల్లర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ లో ధన్యా రాఫియా భాను , వైష్ణో వారియర్ , అక్షయ లతో పాటు ఒక స్టార్ హీరో కూడా నటిస్తున్నారు. గాయత్రి సురేష్ నిర్మాతగా రూపొందుతున్న “కొటేషన్ గ్యాంగ్ ” మూవీ మహారాష్ట్ర , తమిళనాడు , తెలుగు రాష్ట్రాలలో షూటింగ్ జరుపుకోనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























