అరుంధతి : మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ఫాంటసీ డ్రామా “అరుంధతి ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరోయిన్ అనుష్క జేజమ్మ , అరుంధతి గా ద్విపాత్రాభినయం చేశారు. ఆ రెండు పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా నంది జ్యూరీ , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ , గ్రాఫిక్స్ హై లైట్ గా రూపొందిన అరుంధతి ” మూవీ 10 నంది , 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకొనడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాహుబలి : ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో భారీ విజువల్స్ , భారీ గ్రాఫిక్స్ తో “బాహుబలి “మూవీ రెండు భాగాలుగా రూపొంది ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో ప్రపంచవ్యాప్తం గా తెలుగు సినిమా సత్తా చాటింది. ఈ మూవీ లో అనుష్క దేవసేనగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. నేషనల్ అవార్డ్స్ తో పాటు పలు అవార్డ్స్ అందుకొన్న “బాహుబలి “మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.
రుద్రమదేవి : గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణ శేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రాణి రుద్రమ దేవి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 3D బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ “రుద్రమ దేవి “ఘనవిజయం సాధించింది. రాణి రుద్రమ దేవి గా తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ , సినీ మా , ఐఫా అవార్డ్స్ అందుకున్నారు. “రుద్రమ దేవి “మూవీ తమిళ , మలయాళ , హిందీ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ విజయం సాధించాయి. ఈ మూవీ లో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించడం విశేషం.
భాగమతి : యు వి క్రియేషన్స్ బ్యానర్ పై జి అశోక్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ థ్రిల్లర్ “భాగమతి ” మూవీ ఘనవిజయం సాధించింది. అనుష్క అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. US బాక్స్ ఆఫీస్ లో లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి మూవీ తరువాత అనుష్క నటించిన “భాగమతి ” మూవీ వన్ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. “భాగమతి ” మూవీ హిందీ భాషలో “దుర్గాదేవి “గా రూపొందుతున్న విషయం తెలిసిందే.
[totalpoll id=”48711”]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: