ఈవారం అప్ డేట్స్ మిస్ అయ్యారా? మీకోసం మరోసారి

Here Are The Prime Tollywood Movie Updates For This Week

ఈ వారం టాలీవుడ్ అప్ డేట్స్ మిస్ అయ్యారా. అయితే ఈ వారంలో వచ్చిన అప్ డేట్స్ మీకోసం మరోసారి అందిస్తున్నాం. మీరు కూడా ఓ లుక్కేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవన్ బర్త్ డే – బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్

ఈవారంలో హడావుడి ఏదైనా వుంది అంటే అది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అని చెప్పొచ్చు. పవన్ పుట్టినరోజు రోజున ఏకంగా నాలుగు అప్ డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తారు. ముందు వకీల్ సాబ్ నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా.. క్రిష్ సినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డితో సినిమాను కన్ఫామ్ చేశారు. ఇంకా హరీష్ శంకర్ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వీటిలో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరిలో ఉంది. క్రిష్ సినిమా రెండు వారలు షూటింగ్ ను జరుపుకుంది. సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ సినిమాలు ఇంకా మొదలు కాలేదు.

 

 

 

 

చిరుతో మెహర్ రమేష్ సినిమా..!

చిరుతో మెహర్ రమేష్ సినిమా చేస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వీరిద్దరి సినిమాను పవన్ కన్ఫామ్ చేశారు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా మెహర్ రమేష్ కూడా తన ట్విటర్ ద్వారా విషెస్ తెలిపాడు. వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఈ ట్వీట్ కు పవన్ రీ ట్వీట్ చేస్తూ థ్యాంక్యూ రమేష్ చిరంజీవి గారితో చేయబోతున్న సినిమాకు ఆల్ ద బెస్ట్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

 

‘ఆదిపురుష్’ – లంకేశునిగా సైఫ్ అలీఖాన్

ప్రభాస్ 22 సినిమా ‘ఆదిపురుష్’ అప్ డేట్స్ మాత్రం వెంట వెంటనే ఇచ్చేస్తున్నారు చిత్రయూనిట్. `ఆదిపురుష్`లో విలన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారో కూడా చెప్పేసాడు ఓం రౌత్. “7000 వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో అత్యంత తెలివైన రాక్షసుడు ఉద్భవించాడు” అని లంకేశ్వరుని పాత్రలో సైఫ్ నటిస్తున్నట్టు తెలిపాడు.

 

కార్తీక్ రాజు ‘ది చేజ్’ ఫస్ట్ లుక్ రిలీజ్

సందీప్ కిష‌న్ తో నిను వీడ‌ని నీడ‌ను నేనే అనే సినిమా తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ రాజు. ప్రస్తుతం రెజీనా ప్రధానపాత్రలో ‘నేనే నా’ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. తమిళ్ లో హిట్టైన ‘‘ప్యార్ ప్రేమ కాదల్’’మూవీ ఫేం ‘‘రైజా విల్సన్’’ మెయిన్ లీడ్ గా ‘ది చేజ్’ అనే తెలుగు,తమిళ బైలింగ్వల్ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసాడు.

షూటింగ్ మొదలు పెడుతున్న హీరోలు

కింగ్ నాగార్జున. వైల్డ్ డాగ్ చిత్ర షూటింగ్‌తో పాటు బిగ్ బాస్ 4 షూటింగ్‌లో పాల్గొననున్న‌ట్టు తెలిపారు. వైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొనడం చాలా ఫన్ గా ఉందని.. అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నామని.. ఒక వీడియో కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు వైల్డ్ డాగ్ తర్వాత బిగ్ బాస్ 4 షూటింగ్ లో కూడా పాల్గొనాలి తెలిపాడు.

 

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే దాదాపు ఆరు నెలల తర్వాత ఈ మూవీ షూటింగ్ మ‌ళ్లీ స్టార్ట్ అయింది. కరోనా నిబంధనలు పాటిస్తూ.. జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ..షూటింగ్ లో పాల్గొన‌డం ఎక్సయిటింగ్ గా ఉంద‌ని ‌సాయిధ‌ర‌మ్ తేజ్ ట్వీట్ చేశాడు. అంతేకాదు సెట్స్ లో జాయిన్ అయిన వీడియోను ట్విట్ట‌ర్ లో కూడా పోస్ట్ చేశాడు.

 

ప్రస్తుతం A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల బ్రేక్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ షూట్ ను మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో సందీప్ కిష‌న్ సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ.. షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నామని.. చాలా ఎగ్జైట్ గా ఉందని అంకిత భావంతో ప‌నిచేసే ఇలాం‌టి టీం దొరకడం ఆశీర్వాదంగా భావిస్తున్నాని సందీప్ కిష‌న్ ట్వీట్ చేశాడు.

 

సునీల్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా

ఇప్పుడు మళ్లీ సునీల్ హీరోగా కొత్త సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్ర‌ముఖ దర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కథ అందిస్తున్న ఈసినిమాలో సునీల్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ‘వేదాంతం రాఘ‌వ‌య్య‌’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, ద‌ర్శ‌కుడు స‌హా ఇత‌ర‌ సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌కటిస్తామ‌ని తెలిపారు.

 

సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లో రానా

మిలింద్ రౌ ద‌ర్శ‌క‌త్వంలో రానా సినిమా చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. మిలింద్ ఇప్ప‌టికే రానాకు క‌థ వినిపించ‌గా.. రానాకు కూడా స్టోరీ న‌చ్చింద‌ట‌. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో యాక్ష‌న్ అడ్వంచ‌ర్ గా ఈ మూవీ తెర‌కెక్కనున్న‌ట్టు తెలుస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి ఆచంట గోపినాథ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారట. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు వాస్తవ‌ముంద‌నే విష‌యం తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

జూనియర్ యష్ నామకరణం

కన్నడ రాకింగ్ స్టార్ యష్ గత కొన్ని నెలల క్రితమే తన కుమారుడిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నామ‌కర‌ణ వేడుక జ‌రిపించారు యష్ దంపతులు. తమ ఫాం హౌజ్‌లో కొద్ది మంది కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఈ కార్య‌క్ర‌మాన్ని జరిపారు. యథర్వ్ యష్ అనే పేరుని త‌న కుమారుడికి పెట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను యష్ తన ఇన్స్టా లో పోస్ట్ చేసాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash) on

ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్..?

కొరటాల దర్శకత్వంలో మెగా స్టార్ చిరు ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా కథపై ఆరోపణలు రాగా వాటికి చిత్రయూనిట్, కొరటాల క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదిలా వుండగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 9 న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారట. ఇప్పటివరకూ ఏప్రిల్ 9 రిలీజ్ అయిన అన్ని సినిమాలు దాదాపు హిట్ అవ్వడంతో ఇప్పుడు ‘ఆచార్య’ను కూడా ఏప్రిల్ 9న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట.

‘బిగ్ బాస్ 4’ లో లేనంటున్న సింగర్ సునీత

సింగర్ సునీత కూడా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు వార్తలు రాగా దీనిపై స్పందించిన సునీత ‘నా ప్రియమైన మిత్రులారా.. నేను బిగ్‌బాస్ 4 తెలుగులో లేను.. భవిష్యత్తులోనూ ఉండను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్’ అని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. కాగా ఇటీవలే సునీత కరోనా నుండి కోలుకున్న సంగతి తెలిసిందే.

“తుపాకి “మూవీ సీక్వెల్ లో హీరోయిన్ తమన్నా ?

తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. వి క్రియేషన్స్ బ్యానర్ పై ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “తుపాకి ” తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ “తుపాకి 2 ” మూవీ రూపొందనుంది. “తుపాకి 2 ” మూవీ లో హీరోయిన్ గా తమన్నా ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.

పెళ్లి పీటలెక్కబోతున్న విద్యుల్లేఖ రామన్

విద్యుల్లేఖ రామన్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఫిట్ నెస్ ట్రైనర్ అయిన సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని విద్యుల్లేఖ రామన్ తన ఇన్ స్ట్రాగ్రమ్ లో తెలిపింది. త‌న‌కి కాబోయే భ‌ర్త ఫోటోని షేర్ చేసింది. ఆగస్టు 26న తాము రోకా వేడుక చేసుకున్నామని చెప్పింది. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగిందని… తాము మాస్కులు వేసుకుని ఫోటోల కోసం వాటిని తీసేసి మళ్లీ వేసుకున్నామని చెప్పింది.

 

ఇలియానా డిజిటల్ ఎంట్రీ

టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కు ఎంటర్ అవుతున్నారు. ఇంగ్లీష్ లో రూపొందిన “లూథర్ “టీవీ సిరీస్ ప్రేక్షకాదరణ పొందింది. ఈ టీవీ సిరీస్ ను స్టార్ హీరో అజయ్ దేవగన్ కథానాయకుడిగా బాలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ చేయనుంది. ఈ రీమేక్ వెబ్ సిరీస్ లో అజయ్ దేవగన్ కు జోడీ గా ఇలియానా ఎంపిక అయ్యారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =