అనుష్కే స్టార్టింగ్ లో నాకు సాయం చేసింది…!

Anushka Helped Me During The Initial Stage Of My Film Career Says Tamannaah

సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ కు ఒకరంటే ఒకరికి పడదు అన్న రూమర్స్ అయితే ఎప్పటినుండో వున్నాయి. అయితే అది ఒకప్పటి మాట ఏమో కానీ.. ఇపుడు హీరోయిన్స్ మాత్రం చాలా ఫ్రెండ్లీ గా వుంటూ.. ఒకరికొకరు సపోర్ట్ కూడా ఇచ్చుకుంటున్నారు. అంతేకారు ఒకరి సినిమాలకు మరొకరు ప్రశంసలు కూడా కురిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తనకెరీర్ స్టార్టింగ్ లో అనుష్క తనకు ఎంతో హెల్ప్ చేసిందని చెపుతుంది మిల్కీ బ్యూటీ తమన్నా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమన్నాకు శ్రుతీ హాసన్, కాజల్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. వారితోనే కాదు టాలీవుడ్ లో తనకి ఇంకా స్నేహితులున్నారని అనుష్క తనకు కెరీర్ మొదట్లో ఎంతగానో హెల్ప్ చేసిందని కూడా చెప్పింది. ‘నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో నాకు కాస్ట్యూమ్ డిజైనర్ లేరు. అనుష్కే కాస్ట్యూమ్స్ ఎంచుకునే విషయంలో నాకు సాయపడేది. అంతేకాదు, ఇప్పటికీ నాకెలాంటి అవసరం వచ్చినా ఫోన్ చేస్తే చాలు, వెంటనే స్పందిస్తుంది. అలాగే సమంతా కూడా నాకు మంచి ఫ్రెండ్ అంటుంది. కాగా అనుష్క, సమంత కలిసి బాహుబలి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

పదిహేనేళ్ల క్రితం వెండితెర అరంగేట్రం చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికీ వరుస అవకాశాలతో బిజీగానే ఉంది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమాలో నటిస్తుంది ఈ సినిమాలో లేడీ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకూ పూర్తయింది. దీనితో పాటు మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమా తెలుగు రీమేక్ ‘గుర్తుందా శీతాకాలం’ లో కూడా చేస్తుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఇటీవలే ప్రారంభించారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహించనున్నాడు. ఇంకా బోలే చుడియన్ అనే హిందీ సినిమాలో కూడా నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =