ఫైనల్లీ నందు తన ‘బిబి’ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో చెప్పేసాడు. గత రెండు రోజులుగా బిబి అంటూ నందు సోషల్ మీడియాలో ఎంత హడావుడి చేసాడో తెలిసిందే. డార్లింగ్స్ నేను బీబీలో ఉండబోతున్నా… బీబీలో మన రచ్చ మామూలుగా ఉండదు. మరింత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు మీ సపోర్ట్ కావాలి` అంటూ.. ఆ తర్వాత మీరు అనుకునే బిగ్ బాస్ కాదని ఇది వేరే అని చెప్పడంతో .. అందరూ బిగ్ బాస్ అనే ఫిక్స్ అయిపోయారు. అయితే ఆ బిగ్ బాస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది. నందు చెప్పిన ‘బిబి’ ఏంటంటే అతని కొత్త సినిమా `బొమ్మ బ్లాక్బస్టర్` గురించి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజ్ విరాట్ దర్శకత్వంలో నందు, రష్మి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘బొమ్మ బ్లాక్బస్టర్’. తాజాగా ఈ సినిమా టైటిల్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను విజయీభవ ఆర్ట్స్ పతాకం పై పవ్రీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డీ, మనోహార్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
మొత్తానికి నందు స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అయింది. బిబి అంటే బిగ్ బాస్ అనుకుంటారనే ఇలా ప్లాన్ చేసినట్టున్నాడు. ఏదిఏమైనా తన సినిమాను బాగానే ప్రమోట్ చేసుకున్నాడు. మరి సవారి సినిమాతో విభిన్నంగా ప్రయత్నించిన నందు కు ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: