” జెర్సీ” మూవీ తమిళ రీమేక్ లో త్రిష ?

Actress Trisha To Play The Lead Role In The Remake Of Jersey Movie

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని , శ్రద్ధ శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ ” మూవీ ఘనవిజయం సాధించి విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. క్రికెటర్ గా నాని , ఒక బాబు కు తల్లిగా శ్రద్ధ శ్రీనాథ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ గా జీ సినీ అవార్డ్స్ అందుకున్నారు. “జెర్సీ ” మూవీ పలు భాషలలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లు అరవింద్ సమర్పణ లో దిల్ రాజు , అమన్ గిల్ నిర్మాతలుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో షాహిద్ కపూర్ హీరోగా ” జెర్సీ” మూవీ హిందీ లో రీమేక్ అవుతుంది. హీరో రానా దగ్గుబాటి నిర్మాతగా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా ” జెర్సీ” మూవీ తమిళభాషలో రీమేక్ కానుంది. ఒక బాబు కు తల్లిగా శ్రద్ధ శ్రీనాథ్ నటించిన పాత్రను నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రాలేదు. ఇప్పుడు టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =