మరో వెబ్ సిరీస్ లో హీరో శ్రీకాంత్

Tollywood Actor Srikanth To Act In Another Web series

మధు ఫిల్మ్ ఇన్సి ట్యూట్ లో టైనింగ్ పొందిన శ్రీకాంత్ “పీపుల్ ఎన్ కౌంటర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు మూవీస్ లో నెగటివ్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించిన శ్రీకాంత్ హీరోగా రూపొందిన “తాజ్ మహల్ “మూవీ ఘనవిజయం సాధించింది. శ్రీకాంత్ హీరోగా రూపొందిన పలు మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి. 3 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ శ్రీకాంత్ 100 పైగా చిత్రాలలో నటించారు.
“మహాత్మ ” మూవీ కి నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ , “శంకర్ దాదా MBBS ” మూవీ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ శ్రీకాంత్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో శ్రీకాంత్ ప్రస్తుతం మూవీస్ తో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యం లో రూపొందిన “చదరంగం ” వెబ్ సిరీస్ లో నటించిన శ్రీకాంత్ ఇప్పుడు మరో వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి తనయ సుస్మిత నిర్మాణ సారథ్యం లో ఆనంద్ రంగా దర్శకత్వంలో పోలీస్ నేపథ్యంలో “షూట్ అవుట్ ఎట్ ఆలేరు “వెబ్ సిరీస్ రూపొందుతుంది. ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ ఎంపిక అయ్యారు. “షూట్ అవుట్ ఎట్ ఆలేరు “వెబ్ సిరీస్ జీ 5 OTT లో స్ట్రీమింగ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 2 =