KGF2 – సంజయ్ దత్ పై పిటీషన్ కొట్టివేత

Karnataka High Court Quashes The Writ Petition Levied On Sanjay Dutt Against Casting Him In KGF2 Movie

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో కన్నడ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా వచ్చిన కె.జి.యఫ్ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో య‌ష్ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్న సంగతి కూడా విదితమే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. లేకపోతే ఈ సినిమా షూటింగ్ పూర్తయివుండేది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా సంజయ్ దత్ పై హుబ్లీకి చెందిన శివశంకర్‌ అనే వ్యక్తి కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే కదా. అక్రమంగా ఆయుధాలు కలిగివున్నారన్న కేసులో సంజయ్‌దత్‌పై టాడా చట్టం కింద కేసు నమోదై శిక్ష పడింది. ఈ నేపథ్యంలో ఒక నిందితుడు నటిస్తున్న సినిమాకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని పిటీషన్ లో పేర్కొన్నారు శివశంకర్. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్ట్ పిటీషన్ ను కొట్టిపారేసింది. శిక్ష పడిన వ్యక్తి సినిమాలలో నటించకూడదని చట్టంలో లేదని, ఇందులో ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తూ కేసును కొట్టివేశారు.

కాగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను… కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై విజయ్ కిరుగందూర్ భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా‌ను నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేస్తుంది. ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 11 =